Mana Rajadhani
3వ శతాబ్దపు ఆంధ్రుల ప్రాచీన రాజధాని నగరం అయిన అమరావతి, నేడు 21వ శతాబ్దపు నవ్యంధ్రప్రదేశ్ రాజధానిగా అవతరించింది.
మరల మన ఆంధ్రా వాడి సత్తా ఏంటో చూపించే సమయం వచ్చింది. ఇన్నాళ్లు మనం మనది అనుకొన్న భాగ్యనగర అభివృద్ధి లో కీలక పాత్ర వహించి మన ధనాన్ని, శ్రమను ఆ ప్రాంత అభివృద్ధి కి ధారపోసి మన ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేసాము.
కానీ ఇది అసలైన పరీక్షా సమయం.
ఇక పూర్తి సమయం మనం మన ప్రాంత అభివృద్ధి కోసమే వెచ్చించాలి. నిరంతరం అనుక్షణమ్ కష్ట పడుతూ మనతరం, తరవాత తరం వారికీ అభివృద్ధి ఫలాలు అందిద్దాం.
రాజకీయంగా ఎదగాలని ప్రతి అవకాశాన్ని రాజకీయం చేస్తూ మనం మన భావి తరాల భవిష్యత్తుని మనకు మనం చేజేతులా కాలరాస్తున్నాం.. రాజకీయ సంస్థలారా మేల్కొండి.. మన కోసం మనం బ్రతుకుదాం .. తిరిగి మన స్వర్ణాంధ్రను సాధిద్దాం.
ఈ క్షణం మన అందరము ప్రభుత్వ సంకల్పానికి మనవంతు చేయుత నందించి మన భాద్యతను త్రికరణ శుద్ధిగా నిర్వత్రిద్దాం..
ఎక్కడైనా, ఎప్పుడైనా అవినీతికి ఎదురు నిలుద్దాం. పోరాడదాం..
పవిత్ర కృష్ణానది వొడ్డున కొలువైవున్న ఆ అమరలింగేశ్వరనాధుడి అమృత వీక్షణాలు మన అందరిపై ప్రసరించాలని మనసారా కోరుకుంటూ...

No comments: